నానోలట... నానోలు

చేతిలో కోకు
నోటిలో కేకు
పనిలే నాకు

ఆమె కోపం కర్పూర హారతి
ఆమె శాంతం సాంబ్రాణి దూపం
ఆమె మనసు హిమశిఖరాగ్రం
(ఎవరబ్బా? .... )

కవితకొక కొత్త రూపా
పద్యవిధానానికి స్వస్తా
తెనుగుకవితకు ఆంగ్ల నామమా

పదములు వేనవేలు భావాలనంతం
పదాల కుదింపా.. భావాల చిక్కదనమా
కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్

గమనిక : నేను నానోలకు వ్యతిరేకిని కాను, ఇవి కేవలం సరదాకు రాసినవేనని గమనించగలరు

11 comments:

Anil Dasari said...

బ్లాగుల్లో ఎక్కడ చూసినా నానోలే. మొన్నటిదాకా టాటా నానోలనుకుని గందరగోళపడేవాడ్ని. ఈ మధ్యనే ఇవి వేరని తెలుసుకున్నా. ఇంతకీ ఏంటివి? హైకూల్లా కొత్త వింత కవిత్వమా?

Unknown said...

అవునండి ఇది కొత్త కవితాశైలి అట!! (నిజానికి చాలా రోజుల నుంచే ఉన్నాయట 2005 నుంచి రాస్తున్నారట)

మరువం ఉష said...

ఏమిటీదెబ్బా
ఇదేంబాగోలేదబ్బా
నేనొల్లనంటే
వెనుదీయవేం?

;)

పనిలో పని, నా నానోలు ఇక్కడ చూసి మరి కాసినన్ని ఈకలు పీకరాదా, మిత్రమా?

http://nanolu.blogspot.com

Check for on the links at the right for మరువం ఉష నానోలు (3)

Just a couple of samples:

సంకల్పం
ఆశయానుగుణం
సఫలమైతే
అమరత్వం

స్వగతం
అగనికాలం
స్వానుభవం
ఆరనిదీపం

కొత్త పాళీ said...

మీ నానోలకి ఒక ఈక తక్కువైంది! :)

Unknown said...

@ఉష గారు,

వాక్యం ఒక్కటి
పంక్తులు నాలుగు
పదాలు రెండేసి
వెరసి నానో

:)
మీ నానోలు చూసాను, బాగున్నాయి. కానీ నా బాధేమిటంటే, ఒక్క వాక్యాన్ని నాలుగు పంక్తులుగా రాసి దాన్ని ఒక కవిత అనడమే...
శుభ్రంగా ఒక్క వాక్యంలో రాసే దానికి, ఒక్కో పంక్తిలోనూ ఒకటో రెండో పదాలు రాయడమెందుకో.
అటజని కాంచె అన్న మూడు పాదాల వాక్య నిర్మాణంలోని అందమేదీ ఒక వాక్యం రెండేసి పదాలతో నాలుగు పంక్తులు రాస్తే ?

కొసమెరుపు : ఇంత చిన్ని నానోలకు ఈకలు పీకి అలసిపోవడమవసరమా ?

@కొత్తపాళీ గారు,
ఉష గారు వారి నానోల ఈకలు పీకమంటే, మీరు నా నానోల ఈకలు పీకారుగా.. బాగుంది. కావాలనే ఒక ఈక తగ్గించాను. మీరు గమనించారు

Anil Dasari said...

నానోల స్ఫూర్తితో నేను 'నోనో'లు కనిపెట్టా.. మచ్చుకొకటి:

నే
నేనే
నీ
నేనే
నాలో
నేనే
నీలో
నేనే

Unknown said...

@అబ్రకదబ్ర గారు,
భలే ఉన్నాయి మీ నోనోలు. ఇక ప్రచారమే తరువాయి.

sirishasrii said...

oka kuMche ,chinni vidiliMpu;
yavanikapai virisina bulli bomma ;
aa visirins vanne kUDA
kottadE ainappaTikii.....
bulli aMdamokaTi
lEta mokkalugaa talalettinapuDu
aunaMTE ,saripOtuMdi gadaa!
molakanu chidimi
visiri vEyaDaM
nyaayamEnaa mitramaa!

Unknown said...

ఒకప్పుడు చందస్సు నిరోధకమని పద్యాలకు సమాధి కట్ట ప్రయత్నించారు. ఇప్పుడు నానోలే మహా కవిత్వంగా భావించి మరుగుజ్జులవుతున్నారు. అది నా బాధ.
కుంచె నుంచి వచ్చిన విదిలింపు ఒక చిత్రంపై పడితే ఆ చిత్రానికి సొబగులిస్తుంది. అక్కడ చిత్రమే లేనప్పుడు ఆ విదిలింపుకి విలువేముంది ?
ఇక్కడే ఒక వ్యాఖ్యలో చెప్పినట్టు
" శుభ్రంగా ఒక్క వాక్యంలో రాసే దానికి, ఒక్కో పంక్తిలోనూ ఒకటో రెండో పదాలు రాయడమెందుకో. " వాక్య నిర్మాణాన్ని అటకెక్కించే ప్రయత్నం కాదా ఇది?
కావాలంటే ఈ నానోలను ఏదైనా కవితలకు విశేషణాలగానో, విమర్శకోసమో వాడుకోవచ్చు. అంతే కానీ, ఇదే కవిత్వమనుకుంటే ఎలా ?
పైన అబ్రకదబ్రగారి వ్యాఖ్య చూడండి, ఆయనేదో హాస్యానికే రాసినప్పటికీ రేప్పొద్దున్న ఎవరో ఒకరు ఆ ప్రక్రియ మొదలుపెట్టరని నమ్మకమేమిటీ?

Bolloju Baba said...

ఫణి గారూ ఇదివరలో నానోలపై అలోక్ వాస్తవ్ గారి వ్యాసంలో నే చేసిన కామెంటు ఇక్కడకు తీసుకువస్తున్నాను. ఈ చర్చ కు నా రెండు సెంట్లు అన్నట్లుగా. ఇప్పటికీ నా అభిప్రాయాలు అవే.


# :: చమత్కార పదాల కూర్పు కవిత్వమైపోతుందా?

నాకెందుకో ఇలాంటి ప్రక్రియల తో వ్రాసిన వాటిని కవితలని అనబుద్దవ్వదు. వీటిని కవితల శకలాలుగానో, లేక పదచిత్రాలు గానో మాత్రమే మనసు ఒప్పుకొంటుంది. (ఇది ఒక పాఠకునిగా నా అభిప్రాయం మాత్రమే. ఎందుకు వ్రాస్తున్నానంటే, ఇలాంటి అభిప్రాయంతో కూడా కొందరు పాఠకులు ఉంటారన్న విషయం మీకు తెలియాలి కనుక)

ఎనభైలలో మినీ కవితల ఉద్యమం రాకముందే శ్రీ సోమసుందర్ గారు తాము వ్రాసుకొన్న ఇలాంటి శకలాలకు రాలిన ముత్యాలు అని పేరు పెట్టుకొన్నారు.

హైకూల పరిధి, లోతు వేరు.
మినీ కవితలను కొంతవరకూ ఆస్వాదించవచ్చును. ఎందుకంటే కొన్ని ఆరేడు లైన్లు కూడా ఉండేవి కనుక.

ప్రతిభకలిగిన మీబోటి వారు ఇలాంటి పదాల విరుపులకు, చమత్కార వచనానికి పరిమితమవ్వటం కవిత్వానికి అన్యాయం చేయటమే.

బొల్లోజు బాబా
March 14, 2009 9:44 PM

పై కామెంటు నేను మొట్టమొదటగా నానోలు అన్న ప్రక్రియను చూడంగానే చేసిన కామెంటు. దీనికి ఆ నానోల సృష్టికర్త ఇదో ప్రయోగమనీ, దీనికి సాహిత్యాభిమానుల ఆదరణ లభిస్తుందనే ఆశిస్తున్నాననీ జవాబిచ్చారు.

ప్రయోగమనగానే, తెలుగు సాహిత్య రంగంలో సృష్టింపబడ్డ ముత్యాల సరాలు, సిరిసిరిమువ్వలు, కూనలమ్మపదాలు, రాలిన ముత్యాలు, వంటివి మదిలో మెదిలాయి. అలాంటిదే కామోసు ఈ ప్రక్రియకూడా అనిపించింది.

అవి ఆయా కాలాలకి ఆయా కవులపై కల గౌరవంతో కొంతకాలం బతికి బట్టకట్టాయనే అనిపిస్తుంది.

కానీ అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ నిలచిపోయేది జలజల లాడే కవిత్వమే, అది ఒక మహాప్రస్థానం కావొచ్చు, త్వమేవాహం కావొచ్చు, వజ్రాయుధం కావొచ్చు. ఒక తంగేడు పూలు కావొచ్చు లేక కన్యాశుల్కమూ కావొచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు.


బొల్లోజు బాబా

Unknown said...

బాబా గారు,
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు.
జలజలలాడే కవితా నదిలో పయనించి
సాహితీసాగరంలో తేలితే ఉండే ఆనందం
ఇలా చిన్ని కొలనులో ఎన్ని రోజులు ఈత కొట్టినా వస్తుంది చెప్పండి