రెహ్మాన్ కు శుభాకాంక్షలు


రెహ్మాన్ నుంచి వచ్చిన ఉత్తమ సంగీతం కాదు. కానీ ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన సంగీతం.
ఒకేవ్యక్తి రెండు ఆస్కారులు ఒకేసారి గెలవడం కూడా రికార్డేమో చూడాలి...
ఈసారి ఆస్కార్ వేడుకలలో మొత్తం ముగ్గురు భారతీయులు అవార్డందుకోవడం విశేషం
స్లమ్ డాగ్ మిలీయనర్ పై నా వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా, 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

5 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

మీరే బ్లొగ్ లో రెహ్మాన్ కు శుభాకాంక్షలు చెప్పిన మొదటి వ్యక్తి. ఇది రెహ్మాన్ కు రెహ్మాన్ లో ఉన్న ప్రతిభను గుర్తించి సినెమా కు పరిచయం చేసిన యస్.పి.బాల సుబ్రహ్మణ్యం కు, మణిరత్నం కు, రాజ్ కోటి మరియు ఇళయరాజ కు కూడా దక్కిన గౌరవం గా మొత్తానికి దక్షిణ భారత దేశా చలన చిత్ర పరిశ్రమకు, దక్షిణ భరత దేశము లో ఉన్న సంగీత సంస్కృతి కి వాళ్ల ప్రతిభకు దక్కిన సన్మానము గా మనం భవించాలి అని నా అభిప్రాయం .

Anil Dasari said...

>> "ఒకేవ్యక్తి రెండు ఆస్కారులు ఒకేసారి గెలవడం కూడా రికార్డేమో చూడాలి"

రికార్డు కాదు. ఇంతకు ముందు పలువురికి వచ్చాయిలా. ఒకే ఏడాది ఎక్కువ ఆస్కార్లు గెలుచుకున్న రికార్డు వాల్ట్ డిస్నీ పేరు మీదుంది. 1954లో ఆయన ఏకంగా నాలుగు అకాడమీ అవార్డులు కొల్లగొట్టాడు (ఆయన గెలుచుకున్న మొత్తం ఆస్కార్ల సంఖ్య 26. ఇదీ ఓ రికార్డే)

Unknown said...

@శ్రీకరు గారు,
నిజమే కానీ మనలో మనం దక్షిణ భారతం, ఉత్తర భారతం , పశ్చిమ భారతం , ఈశాన్య భారతం అనుకుంటూ విభజించుకుంటే ఎలాగండీ?
ఇక నేనే మొదట శుభాకాంక్షలు చెప్పిన వ్యక్తినని నాకు తెలియదు. ఎందుకంటే నేను రాసే సమయానికి రెహ్మాన్ కు అవార్డు ప్రకటించి అరగంట దాటింది. (అలాగని ఇదేమీ గొప్పా కాదు. అబినందించటానికి ముందైతే ఏమి, వెనకైతే ఏమి? )
@అబ్రకదబ్ర గారు,
మంచి సమాచారమందించినందుకు ధన్యవాదములు

మరువం ఉష said...

I was so blessed to watch that show. He looked to content and accepted the honor and award so humbly. I admired the part where he kind of devoted/attributed the recognition to his mother and the way he expressed how he chose the 'love' route given a choices of 'love' and 'hate'.

I have been busy at work and hence not so actively blogging lately while also had issues with my password to the gmail. Thanks for your regular visit to maruvam.