సాఫ్టువేరింజనీరు -- మరో కవిత


వాన పడిందో లేదో తెలియదు
ఎండల మంటతో సంబంధమే లేదు
చలి పులి భయమే లేదు
ఎప్పుడు నిద్ర పోతాడో తెలియనే లేదు
పొలంలో నాటిన విత్తు మొలిచిందో లేదో తెలియదు
మనసు విప్పి చివరి సారి ఎప్పుడు " నోరారా " మాట్లాడాడో తెలియదు

తనకు తెలిసిందొకటే
బుల్లిదో పెద్దదో ఏదో ఒకటి ఆ రంగుల తెరవేపే చూడడం
ఒక చేతిని ఎప్పుడూ నేలకు సమాంతరంగా 180 డిగ్రీల కోణంలో తిప్పడం
ఇక మరో చెయ్యి ఎప్పుడూ మీటలు నొక్కడం
ఇన్ని అవలక్షణాలున్నా
అతను విశ్వ విజేత ...
మరో సృష్టికి రాళ్ళెత్తుతున్న కూలీ ... టెక్నికల్ కూలీ

(బ్రహ్మచారి సాఫ్టువేరింజినీరు గురించి మాత్రమే సుమా..... )
బ్రహ్మచారులకు మాత్రమే అన్నది చదివిన ఒక స్నేహితుడు వివాహితుల పరిస్థితి కూడా ఇదే నాయనా అనడంతో ఆ లైనులను కొట్టివేయడం జరిగినది.

12 comments:

శ్రీ said...

బాగుంది కవిత

Malakpet Rowdy said...

Good one!

పరిమళం said...

టెక్నికల్ కూలీ ??బాగుంది.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@శ్రీ, మల్కాపేట్ రౌడీ ,
ధన్యవాదములు
@పరిమళం
టెక్నికల్ కూలీ నా సొంత పదం కాదు. నా స్నేహితుడు విశ్వనాద్ సృష్టి. పోష్టు రాసే తొందరలో క్రెడిట్ ఇవ్వడం మరిచా....

శివ బండారు said...

నేను సాఫ్టువేరింజనీరు కాకపోయినా నాలైప్ కు దగ్గరగా ఉంది కవిత :)

satish said...

ఈ జీవితం కాస్తా e-జీవితం అయితే ఇలానే ఉంటుంది :(

మనోహర్ చెనికల said...

technical koolie-baagundi

ఉష said...

i differ with you. I enjoy what I do as I make a priority call of the tasks on my hand. I derive a lot of professional satisfaction while also catering for my personal life.

Quoting words from a friend's friend.

"The good part about my job is that I get to see the sun rise every day and the bad part of my job is that I got to leave for work before sun rise"

So it's the perception that matters and each context has to be viewed as put in a perspective. I am not trying to judge just adding my words.

ఉష said...

నిజానికి ఈ కలియుగంలో మన విరోధి - ఆధునిక జీవన రీతి. నేను దాని మీద ఎపుడోనే యుద్ధం ప్రకటించేసాను. నా వ్యూహరచనలో నేనుంటాను, దాని కుట్రలతో అది నన్ను గెలవాలని చూస్తుంటుంది. ప్రస్తుతానికి సంధికొచ్చినట్లుగావుంది. మల్లెలు, కాఫీలు వుండవు కాని, ఉర్మిళ నిద్రలు, పిల్లల పట్ల అపరాధభావనలు తగ్గాయి, ఆ స్థాయి/విజయం నన్ను చేరటానికి నేను వెచ్చించాల్సి వచ్చేది కొన్ని ఘడియల నిద్ర. సో, నా సమస్యకి నేనే పరిష్కారం వెదుక్కున్నాను. నా స్థితిలో వున్న వారంతా ఈ ఒక విషయం తెలుసుకుంటే, అలాగే భాగస్వాములిరువురూ పాలు పంచుకుంటే ఇకపై ఈ మాదిరి ఆవేదనలు, కవితలూ రావు. This is just yet my humble opinion out of personal experience.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

ఉషగారు,
నాకు ఏ విధమైనా ఆవేదనా లేదు. నేను నా పని ప్రేమిస్తాను. నా పని నాకు ప్రాణం.
జనవరి ఒకటంటూ ప్రపంచం సంబరాలలో మునిగ్నప్పుడు కూడా నిద్ర మానుకుని ఆఫీసులో పని చేసిన రోజులున్నాయి. ఇంటిలో నిద్ర వచ్చే సమయంలో కళ్ళు మూసుకుని ఫోనులోనే కోడింగు చెప్పిన రోజులూ ఉన్నాయి.
ఏ రోజూ నేను భాద పడలేదు. కానీ మీరన్నట్టు నాకు కూడా ఆధునిక జీవనరీతే విరోధి.
అయితే ఎప్పుడూ పరిగెట్టడమేనా అనుకుంటూ ఒక్క నిమిషం ఆగి ఆలోచించినప్పుడు "ఈ పరుగు ఎవరి కోసం" అని నా మనసడిగింది. అవును నా పరుగు ఎవరి కోసం?

Anonymous said...

నేను ఇంకొన్నాళ్లలలో సాప్టువేరింజనీరు అవతారం ఎత్తనున్నాను. మరి నేను కూడా మీలాగా ఆ జీవితాన్ని రుచి చూసాక, కవితలు వ్రాయడం మొదలుపెడతానో ఏమో!!!

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

సాయి ప్రవీణ్ గారు,
స్వాగతం, మీరు కవితలు రాయడం మొదలు పెట్టండి, వాటి ఈకలు పీకడమో లేక పొగడ్తలలో ముంచెత్తడమో మేము చేస్తాం