తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు

స్థానిక గణన యంత్రములో ఉపయోగించగల తెలుగు ఆంగ్లం నిఘంటువుని తయారు చెయ్యడమైనది.
ప్రస్థుతానికి ఇది కేవలం విండోస్ కి మాత్రమే ఉద్దేశించడమైనది. అయినప్పటికీ ఇది డాట్ నెట్ ఉపయోగించి తయారు చెయ్యడం వల్ల మోనో ఉపయోగించి లైనక్సులో కూడా ఉపయోగించవచ్చు. నేను ఇంకా లైనక్సులో చూడలేదు. కాబట్టి ఎవరైనా చూసి చెప్పగలరు.

ముందు కావాల్సిన పరికరాలు:

నిఘంటువు వివరాలు:
  • దిలీపు తయారు చేసిన ఆన్ లైన్ నిఘంటువు ఆధారంగా అభివృద్ది చెయ్యబడినది. (వివరాలకు http://groups.google.com/group/telugublog/browse_thread/thread/fe9dc71ec0b483f2 చూడగలరు )
  • వర్షను సంఖ్య 0.2 బీటా - దిగుమతి చేసుకోవలసిన లింకు http://www.miriyala.in/dl/TE2EN.zip?attredirects=0 
  • బ్రౌను దొర (దొరల కాలం పోయినా ఆ పిలుపు మారదు కదా హతోస్మి!!) తయారు చేసిన నిఘంటువు
  • తెలుగు నుంచి ఆంగ్లము అలాగే ఆంగ్లము నుంచి తెలుగు కూడా తర్జుమా చేయగలదు
విమర్శలు తెలుపుటకు నాకు ఎలక్ట్రానిక్ ఉత్తరం పంపగలరు

తెలిసిన తప్పులు : గురించి అన్న చోట బ్రౌను పేరు తప్పుగా ఉన్నది. కాబట్టి దీన్ని మళ్ళీ పంపవలదు.

ఇప్పటి నుంచి పదిహేను రోజుల పాటు అంటే నరక చతుర్ధశి వరకు వచ్చే విమర్శలను పరిగణలోకి తీసుకుని దీపావళి నాడు తరువాతి వర్షను విడుదల చెయ్యబడుతుంది. ఒక వేళ విమర్శలు రానిచో ఇదే వర్షను కొనసాగుతుంది.


స్క్రీను షాటులు కోసం కింద ఇచ్చిన లింకులు చూడండి

http://5676430411356704223-a-miriyala-in-s-sites.googlegroups.com/a/miriyala.in/home/Home/About.jpg?attredirects=
http://5676430411356704223-a-miriyala-in-s-sites.googlegroups.com/a/miriyala.in/home/Home/Telugu%20To%20English.jpg?attredirects=
http://5676430411356704223-a-miriyala-in-s-sites.googlegroups.com/a/miriyala.in/home/Home/English%20To%20Telugu.jpg?attredirects=

No comments: